ఐదుగురు జూదరులు అరెస్ట్
SKLM: ఎల్.ఎన్.పేట(M) తురక పేట సెంటర్లో ఓ ఇంటిలో జూద శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.7,980 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని సరుబుజ్జిలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై హైమావతి తెలిపారు.