బొమ్మూరులో సమగ్రశిక్షా ఉద్యోగుల ఆందోళన
E.G: సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ డిమాండ్ చేసింది. బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం వారు పోరాట దీక్ష చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.