'లోక్ అదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం'

'లోక్ అదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం'

MDK: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్‌ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు ఉన్నారు.