'రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోండి'
MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో గత నెల 28 లోపు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని AEO సునీల్ కుమార్ తెలిపారు. గతంలో రైతు భరోసా పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్సులతో AEO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.