'నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి'

'నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి'

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆరవ వార్డులో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు, డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ తెలిపారు.  మంగళవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.