స్లాట్ బుకింగ్ విధానం రద్దు చేయాలి

BNR: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించాలని కోరుతూ మంగళవారం చౌటుప్పల్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు.