ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

SKLM: వేసవిలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు శుక్రవారం ఆమదాలవలస కాలేజీ జంక్షన్ వద్ద ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలి వేంద్రాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సభ్యులు చాపర రమేష్ ప్రారంభించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు.