VIDEO: వన దుర్గమ్మకు విశేష పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం, చతుర్దశి, భౌమ వాసరే పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు పవిత్రంగా జలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.