జిల్లా హైకోర్టు జడ్జి ప్రియదర్శిని మృతి

KNR: కరీంనగర్ జిల్లా జడ్జిగా పనిచేసి తనదైన ముద్రను వేసిన హైకోర్టు జడ్జ్ ప్రియదర్శిని సోమవారం మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందినట్లు పలువురు స్థానిక న్యాయవాదులు తెలిపారు. కరీంనగర్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రియదర్శిని జిల్లాకు మంచి పేరు తీసుకువచచ్చిందని, ఆమె మృతి చెందడం బాధాకరమని జిల్లాకు చెందిన లాయర్లు సంతాపం వ్యక్తం చేశారు.