సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

E.G: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ ట్రాఫిక్-1, 2 సీఐ రమేష్, ఎస్సై రత్నం సూచించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం బీఎస్ఎన్ఎల్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకం, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ రుణాల మోసాలు, ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు.