VIDEO: లక్షెట్టిపేటలో భారీ వర్షం
MNCL: లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం మండలంలోని దౌడేపల్లి, పరిసర గ్రామాలలో అరగంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒకసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం నమోధై వాతావరణం చల్లబడింది. భారీ వర్షాలతో కోత దశకు వస్తున్న పంటలకు నష్టం వస్తుందని రైతులు వాపోయారు.