VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
కల్లూరు అర్బన్ 37వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించి, వైద్యులు సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు. వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.