వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధ్వజారోహణం
CTR: పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపానగల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం ధ్వజారోహణం వైఖానస ఆగమక్తంగా వేద పండితులు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి మూలవర్లను దర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు.