డ్రంక్&డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడు ఆత్మహత్య
TG: HYDలోని మల్కాజ్‌గిరి పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాననే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్‌రెడ్డి(32) అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 120 రీడింగ్ నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.