'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి'
BHNG: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే 'ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.