జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం: మాజీ మంత్రి
KKD: జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తేటగుంటలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ రుణాలు రూ.6.5 లక్షల కోట్లకు చేరాయని, ఈ నిధుల వ్యయంపై 'కాగ్'కు లెక్కలు చూపలేదని విమర్శించారు. FRBM నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు.