కార్తీకమాసం చివరి సోమవారం.. ఇలా చేస్తే..!
కార్తీక మాసం నవంబర్ 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 17వ తేదీ ఆఖరి కార్తీక సోమవారం వస్తుంది. 'ఈ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం ఆచరించాలి. అనంతరం ఉపవాసం ఉండి.. శివాలయంలో శివునికి అభిషేకం చేయించాలి. ఆవు నెయ్యితో ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయాలి. అంతేకాకుండా 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి' అని పండితులు చెబుతున్నారు.