'వెంటనే ఆ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి'
KDP: కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (రిమ్స్)లో 50 సంవత్సరాల పైబడిన 111 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, CITU ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి సంఘీభావం తెలిపారు.