'తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇచ్చేలా చూడాలి'
W.G: భీమవరం కలెక్టర్ ఛాంబర్ నుంచి చెత్త సేకరణపై నరసాపురం ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీవోలతో కలెక్టర్ నాగరాణి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణంలో పెరిగిపోతున్న చెత్తను తొలగించేందుకు ఇప్పటికే 40 టన్నుల చెత్తను వివిధ ప్రదేశాల్లోని డంపింగ్ యార్డులకు తరలించడం జరిగిందన్నారు. ప్రజలు కచ్చితంగా తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇచ్చేలా చూడాలన్నారు.