నేటి నుంచి రెండో విడత నామినేషన్లు: కలెక్టర్
NZB: నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడతగా NZB డివిజన్‌లోని ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్‌లోని జాక్రాన్‌పల్లి మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరలేవనుంది. రెండో విడత 196 సర్పంచ్ స్థానాలకు, 1760 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.