కుక్కల బెడద లేకుండా చూడండి: కలెక్టర్

NLG: పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్‌లో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. గ్రామాలలో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.