మామునూరు ఎయిర్ పోర్టుకు మలి అడుగు

HNK: వరంగల్ ప్రజల దశాబ్దాల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం కావాల్సిన భూసేకరణ నిమిత్తం రూ.205 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఎంపీ కావ్య రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు విడుదల చేయడం ద్వారా తన నిబద్ధతను మరోసారి చాటుకుందని పేర్కొన్నారు.