ఎమ్మెల్యే సొంత నిధులతో సాయం..!
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంటకరమణ రెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు తన సొంత నిధులతో డ్యూయల్ డెస్క్‌లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 18,000 మంది విద్యార్థులకు దాదాపు 4 కోట్ల వ్యయంతో 6,000 డెస్క్‌లు అందించనున్నారు. ఇందులో భాగంగా రేపు దోమకొండ, బిక్నూర్, బీబీపేట్ మండలాల్లో కేపీ రాజారెడ్డి, జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడత ప్రారంభించనున్నారు.