ఒంగోలులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఉగ్ర

ఒంగోలులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: 'గ్రీన్ ఒంగోలు' కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇందులో పాల్గొని మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు నగరపాలక సంస్థ చేపట్టిన గ్రీన్ ఒంగోలు కార్యక్రమం అభినందనీయమన్నారు.