బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పిద్దాం: కలెక్టర్
NTR: జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కొండపల్లి బొమ్మల పండుగ వేదికగా 'బడి పిలుస్తుంది' ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి విద్యాభ్యాసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. చదువుకు ఎవరూ దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.