'ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వరం సేవలందించాలి'
E.G: వివిధ శారీరిక సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆలస్యం లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల వైద్యులను ఆదేశించారు. కడియం ప్రభుత్వ హాస్పటల్‌ను బుధవారం ఎమ్మెల్యే గోరంట్ల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బారులు తీరి నిరీక్షిస్తున్న రోగులను కలిసి వైద్య సేవలపై ఆరాతీసి సిబ్బందికి పలు సూచనలు చేసారు.