గద్వాల జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం

గద్వాల జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం

GDWL: జిల్లాలో 2025-26 యాసంగి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 87 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా గన్నీ బ్యాగులు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరపాలని సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్పష్టం చేశారు.