సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు విరాళాల సేకరణ
ఖమ్మంలో డిసెంబర్ 26న నిర్వహించే సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు గాను సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం చింతకాని మండలం నేరేడలో జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి, మండల కార్యదర్శి గోపాల్ రావు పార్టీ కార్యకర్తలతో కలిసి విరాళాలను సేకరించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.