అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బీసీ
NDL: బనగానపల్లె పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. బనగానపల్లె కోయిలకుంట్ల నూతన రహదారి నిర్మాణం పనుల గురించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.