బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

PDPL: పెద్దపల్లి పట్టణంతోపాటు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు పరామర్శించారు. మరణించిన వారి చిత్రపటాలకు పూలమాల వేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.