చలివేంద్రం ప్రారంభించిన సీఐ

ASR: రాజవొమ్మంగి పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ వద్ద సీఐ సన్యాసినాయుడు నాయుడు చలి వేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వేసవి కాలంలో ప్రయాణికులకు ఈ కేంద్రం చాలా ఉపయోగపడుతుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.