నరసాపురంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రేడ్-1 లైబ్రేరియన్ కేజేఎస్ఎల్ కుమారి తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈనెల 14న వారోత్సవాలు ప్రారంభమై, 20వ తేదీన ముగుస్తాయని ఆమె సోమవారం తెలిపారు. ముగింపు రోజున వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.