సర్పంచులకు ఘన వీడ్కోలు
TPT: ఎర్పేడు మండల సర్పంచుల పదవీకాలం ముగియడంతో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సర్పంచులు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించిన వారి కృషి అభినందనీయమన్నారు.