ఈనెల 6న జిల్లాలో పర్యటించనున్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
ATP: వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈ నెల 6న అనంతపురానికి రానున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో నిర్వహించనున్న 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారని నేతలు తెలిపారు. యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.