భారీగా పడిపోయిన ధర.. రైతులు ఆవేదన

భారీగా పడిపోయిన ధర.. రైతులు ఆవేదన

AP: రాష్ట్రంలో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోయాయి. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్‌లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే రావడంతో తీవ్ర నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు ఉందని రైతులు తెలిపారు.