పల్లెలకు రానీ పల్లె వెలుగు బస్సులు

MDK: జిల్లా వ్యాప్తంగా పల్లె గ్రామాల్లో పల్లె వెలుగు బస్సులు కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ మేరకు రామాయంపేట మండల పరిధిలోని రాయిలాపూర్, సూతర్ పల్లి, నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట, తిప్పనగుళ్ల, బచ్చురాజ్ పల్లి, గ్రామాలలో పల్లె వెలుగు బస్సులు నడవడం లేదని, వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి పల్లెలకు వచ్చేలా చూడాలన్నారు.