VIDEO: తెరుచుకున్న బోగత జలపాతం.. పర్యాటకులకు అనుమతి

ములుగు జిల్లాలోని వాజేడు బోగత జలపాతం సోమవారం నుంచి పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి వచ్చింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం ఉగ్రరూపం దాల్చి కనువిందు చేస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, పర్యాటకుల భద్రత కోసం పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత, నీటి కొలనులోకి అనుమతి లేకుండా సందర్శకులను అనుమతించారు.