'అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

'అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

MDK: అవినీతిపై ఉక్కు పాదం మోపి అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి అంతమొందించి జిల్లాలో పారదర్శకత పాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. శాఖలో పేరుకుపోతున్న అవినీతిని కూకటివేలతో పెకిలించడమే లక్ష్యం అన్నారు.