'అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దు'
ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలపట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మితా రామనాథన్ పాల్గొని, మన మొబైల్ నంబర్‌కు వచ్చిన పాస్‌వర్డ్ షేర్ చేయకూడదని అన్నారు. అనుకోని లింకులు వచ్చినప్పుడు వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు.