'దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

'దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

బాపట్ల: సంతమాగులూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో పురోహితులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాల భద్రతపై ఆయన పలు కీలక సూచనలు చేశారు. ప్రతి దేవాలయంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, హుండీ నగదు విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఆ మొత్తాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులో జమ చేయాలని సూచించారు.