ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLG: దేవరకొండలోని గ్రంథాలయంలో రూ.3.20 లక్షల వ్యయంతో "సంజీవిని ITI" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఇవాళ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముక్కామల వెంకటయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.