డిసెంబర్ 1న అయ్యప్పస్వాములతో గిరి ప్రదక్షిణ

డిసెంబర్ 1న అయ్యప్పస్వాములతో గిరి ప్రదక్షిణ

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయ్యప్ప స్వాములకు సువర్ణావకాశం కల్పించింది. డిసెంబర్ 1న ఉదయం మాలధారణ స్వాములతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఉచిత గర్భాలయ దర్శనం, ప్రసాదం సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఈవో వెంకట్రావు ఇవాళ ఆవిష్కరించారు.