VIDEO: రోడ్డు బ్లాక్.. వ్యాపారుల ఆగ్రహం

VIDEO: రోడ్డు బ్లాక్.. వ్యాపారుల ఆగ్రహం

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ జాతర సందర్భంగా పోలీసులు హన్మకొండ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. దీంతో భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజీవ్ చౌరస్తా వద్ద రోడ్డును బ్లాక్ చేశారు. రోడ్డు బ్లాక్ చేయడంతో పండుగ వేళ తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.