నగారా మోగిస్తూ మతురల కోలాటాల సంబరాలు

నగారా మోగిస్తూ మతురల కోలాటాల సంబరాలు

SRD: కంగ్టి మండలంలోని సర్దార్ తాండలో మథుర లంబాడీలు ఆదివారం సాంప్రదాయ సంబరాలను జరుపుకున్నారు. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉపవాస దీక్షలు చేశారు. నెయ్యితో చేసిన మాల్ పూరి, దోల్, ప్రత్యేక వంటకం చేసి స్వామికి నైవిద్యం, భోగ్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు అన్నదానం చేశారు. అనంతరం నగారా మోగిస్తూ కోలాటలు ఆడారు.