ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి: ఎస్సై
KMM: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని ఎస్సై లక్ష్మీ భార్గవి అన్నారు. బుధవారం మధిర మండలంలోని పలు గ్రామాలలో స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నిక నియమావళికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.