'వీరమరణం పొందిన వీరుల కోసమే కలశయాత్ర'

SRCL: రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే 'రేజాంగ్ల రజ్ కలశ యాత్ర'ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 'రేజాంగ్ల రజ్ 'కలశయాత్ర' ఆదివారం తంగళ్లపల్లికి చేరుకుంది.