' మేడిగడ్డలో తగ్గుతున్న వరద ప్రవాహం '

' మేడిగడ్డలో తగ్గుతున్న వరద ప్రవాహం '

BHPL: కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం 2,40,460 క్యూసెక్కుల వరద నమోదైంది. సోమవారం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద తగ్గినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరి నది ప్రవాహం తగ్గుతోంది. అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.