నేటి నుంచి ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు
ADB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. టాస్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త అశోక్ తెలిపారు. పదో తరగతి అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.