నూతన బ్రిడ్జిని ప్రారంభించిన: MLA
BHPL: గోరికొత్తపల్లి మండలం జమ్ షెడ్ బేగ్‌పేట - సుల్తాన్‌పూర్ గ్రామాల మధ్య రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బ్రిడ్జిని ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వీరేందర్ తదితరులు ఉన్నారు.