నేడు అన్ని విద్యాసంస్థలకు సెలవు

KMM: భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందన్నారు. జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.